News December 12, 2025
ప్రభుత్వ టీచర్ ఆదర్శం!

➤ తన బిడ్డకూ అదే బడి
SS: గవర్నమెంట్ టీచర్ తన కుమారుడినీ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రానికి చెందిన స్వర్ణ సోమందేపల్లి మండలంలోని కొలిమిపల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తన కుమారుడు సాత్విక్‌ను ఇదే పాఠశాలలో చదివిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందనడానికి ఇదే నిదర్శనమని కొనియాడుతున్నారు.
Similar News
News December 12, 2025
ఐదు దేశాలతో ‘C5’కు ప్లాన్ చేస్తున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు శక్తిమంతమైన దేశాలతో ‘C5’ అనే కొత్త వేదికను ఏర్పాటు చేయనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్‌లతో ఈ గ్రూప్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ధనిక, ప్రజాస్వామ్య దేశాలకే పరిమితమైన ‘G7’కు భిన్నంగా, కోర్ ఫైవ్ (C5) దేశాలు ఇందులో ఉంటాయి. తద్వారా యూరప్ ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News December 12, 2025
తండ్రి ప్రేమ అంటే ఇదే❤️

కొడుకు భవిష్యత్తు కోసం ఓ తండ్రి చేసిన సాహసం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఢిల్లీ నుంచి ఇండోర్‌కు వెళ్లే ఇండిగో విమానం రద్దవడంతో కొడుకు 12th పరీక్ష మిస్సవుతుందనే ఆందోళనతో ఆ తండ్రి ప్రత్యామ్నాయం ఎంచుకున్నారు. రాత్రంతా మేల్కొని 800kms స్వయంగా కారు నడిపారు. కొడుకు పరీక్ష సజావుగా రాశాకనే ఆ తండ్రి మనసు కుదుటపడింది. పిల్లల కోసం తండ్రి ఏ త్యాగానికైనా సిద్ధపడతారని ఈ ఘటనే నిరూపించింది.
News December 12, 2025
కాలుష్య సమస్యపై చర్చ కోరిన రాహుల్.. అంగీకరించిన కేంద్రం

దేశంలో గాలి కాలుష్యం పెరిగిపోతోందని, పరిష్కార మార్గాలపై చర్చించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ‘పిల్లలకు లంగ్స్ సమస్యలు వస్తున్నాయి. గాలి పీల్చుకోవడానికి వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు’ అని చెప్పారు. గాలి కాలుష్య సమస్యపై చర్చకు ప్రభుత్వం రెడీగా ఉందని లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ దానికి సమయం ఇస్తుందని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరన్ రిజిజు తెలిపారు.


