News August 29, 2025
ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలి: కలెక్టర్

పిల్లలు లేనివారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కేరా నిబంధనల ప్రకారం దత్తత ప్రక్రియ జరగాలని ఆయన స్పష్టం చేశారు. బంధువుల పిల్లలైనా, ఇతరుల పిల్లలైనా నిబంధనలను పాటించకుండా దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పిల్లలను పెంచుకోవడం, దత్తత ఇవ్వడం లేదా తీసుకోవడం నేరమని పేర్కొన్నారు.
Similar News
News August 29, 2025
ఖమ్మం: రైల్వే స్టేషన్ సమస్యలపై బీజేపీ చీఫ్‌కు వినతి

చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులు కూర్చోవడానికి బళ్లలు, మంచినీటి సదుపాయాలు, విద్యుత్తు లైట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, తదితరులున్నారు.
News August 29, 2025
సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల బంద్ పాటిస్తాం

డీలర్లకు నెలలు తరబడి పెండింగ్ ఉన్న కమీషన్‌ను ఈనెల 31వ తేదీ వరకు విడుదల చేయాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు వెంకన్న, షేక్ జానీమియ కోరారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 1నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 1వ తేదీన తహసీల్ ఎదుట, 2న ఆర్డీఓ కార్యాలయాల ఎదుట, 3వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడమే కాక 4న అసెంబ్లీ ముట్టడి చేపడతామని తెలిపారు.
News August 29, 2025
మాస్టర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

పీఎం ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. అనంతరం 63 మంది మాస్టర్‌లకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. జిల్లాలో 9 మండలాల పరిధిలో 35 గ్రామాలలో అమలుచేసే గిరిజన జనాభాకు అందుబాటులో ఉన్న వనరులు పరిశీలించారు. ఇంకా ఏమేమి వసతులు కావాలో ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.