News July 3, 2024
ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలి: రామచందర్

ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబు, రీసెర్చ్ అధికారి వరప్రసాద్‌తో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారం నిబంధనల ప్రకారం సకాలంలో అందించాలని సూచించారు. పలువురు అధికారులున్నారు.
Similar News
News February 22, 2026
భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వరద కాలువ, మిడ్ మానేరు, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి, రైతుల ప్రయోజనాల దృష్ట్యా భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

News February 21, 2026
KNR: టీజీవో డైరీని ఆవిష్కరించిన కలెక్టర్ పమేలా సత్పతి

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా డైరీ-2026ను కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు కాళిచరణ్ ఆధ్వర్యంలో గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. అసోసియేషన్ రూపొందించిన ఈ డైరీలో ఉద్యోగులకు అవసరమైన సమాచారం పొందుపరచడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. ఇది విధుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.