News February 26, 2025
ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేద్దాం: ADB కలెక్టర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రభుత్వ పథకాలను జిల్లాలో గెజిటెడ్ అధికారుల సహకారంతో సమర్థవంతంగా అమలు చేద్దామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖ రూపొందించిన డైరీని కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. అంతకు ముందు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివకుమార్, రామారావు, తదితరులు ఉన్నారు.
Similar News
News February 26, 2025
ADB జిల్లాలో 31 ఇంటర్ పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఎస్ఈకి సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేర్చాలన్నారు.
News February 25, 2025
ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి పర్యావరణ పరిరక్షణకు కొత్తబాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్ కోడ్లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామని BRS మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదికగా పోస్టు చేసి ఆమెను అభినందించారు.
News February 25, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,920గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో మార్పు లేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.20 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.