News March 10, 2026

ప్రభుత్వ పథకాలు అర్హులకు అందాలి: మంత్రి మండిపల్లి

image

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

Similar News

News April 19, 2026

చిత్తూరు: కాలేజీలో కూలిన మెస్ భవనం!

image

చిత్తూరులో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరులోని ఓ కళాశాలలో నూతనంగా నిర్మించిన మెస్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. కూలిన సమయంలో ఆ భవనంలో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశంపై సంబంధిత కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. వాస్తు దోషం కారణంగా ఈ భవనాన్ని కూల్చివేసినట్లు చెబుతున్నారు.

News April 19, 2026

చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

image

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News April 19, 2026

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ ఇయర్‌లో 12,567 మందికి 8,691 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 11,651 మందికి 8,280 మందే పాసయ్యారు, 3,371 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించాలి.