News March 26, 2024

ప్రభుత్వ పాఠశాలలకు రూ.91 లక్షలు మంజూరు

image

నల్గొండ జిల్లాలో 1,483 ప్రభుత్వ పాఠశాలలతో పాటు మోడల్, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటికి ఏటా స్కూల్ మెయిన్టెనెన్స్ కింద (చాక్పీసులు, డస్టర్లు , స్టేషనరీ, ఇతర వస్తువుల కొనుగోలు కోసం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు చేస్తుంది. రెండేళ్లుగా ప్రభుత్వం జూలై, జనవరి నెలల్లో రెండు విడతల్లో ఈ నిధులు ఇస్తుంది. మూడు రోజుల క్రితం జిల్లాకు రూ.91 లక్షలు మంజూరు చేసింది.

Similar News

News September 9, 2025

NLG: పోషణ ట్రాకర్, NHTS యాప్‌లతో అష్టకష్టాలు!

image

జిల్లాలో అంగన్వాడీ టీచర్లు పోషణ ట్రాకర్, NHTS యాప్‌లతో అష్టకష్టాలు పడుతున్నారు. పోషణ ట్రాకర్ యాప్లో లబ్దిదారుల ముఖ హాజరు నమోదుకు ఇబ్బంది తప్పడం లేదు. ఫేస్‌ను యాప్లో గుర్తించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సపోర్ట్ చేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. సర్వర్ సమస్యతో యాప్ లు మొరాయిస్తుండటంతో కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొంతమంది నెలలో ఐదారుసార్లు కేంద్రాలకు రావాల్సి వస్తుంది.

News September 9, 2025

NLG: జీపీఓలు వచ్చేశారు!

image

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పాలన అధికారులు ఎట్టకేలకు విధుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,016 మంది జీపీఓలను నియమించగా నల్గొండ జిల్లాకు 276 మందిని కేటాయించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశానిర్దేశంలో అధికారులు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రెవెన్యూ గ్రామాలతో ఏర్పాటుచేసిన క్లస్టర్ల వారీగా జీపీఓలకు పోస్టింగ్ ఇచ్చారు.

News September 9, 2025

NLG: సులువుగా ఎర.. చిక్కితే విలవిల

image

నల్గొండ జిల్లాలో రోజు రోజుకు సైబర్‌ నేరగాళ్లు పేట్రేగి పోతున్నారు. నిరక్షరాస్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు సైతం వీరి ఉచ్చులో పడి మోసపోతున్నారు. ఇటీవల మిర్యాలగూడకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి వీడియో కాల్‌ చేసి మీపై పోక్సో కేసు ఉందని బెదిరించి రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులను ఆశ్రయించగా అది సైబర్‌ నేరగాళ్ల పనేనని వారు నిర్ధారించారు.