News August 14, 2025
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య: DEO

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సిద్దిపేట ఈడీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణరావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారంతో లక్ష రూపాయల విలువైన షూలు, ఐడి కార్డులు, బెల్టులు వంటి అందజేశారు.
Similar News
News August 14, 2025
మంచిర్యాల: సెప్టెంబర్‌లో రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్షలు

సెప్టెంబర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్షల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం రాష్ట్రీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంచిర్యాల డీఈఓ యాదయ్యకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం పరిషత్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కొట్టే నటేశ్వర్, బీజేపీ నాయకుడు కిషోర్ మాట్లాడుతూ.. ఈ పరీక్షల్లో విజేతలకు ప్రథమ రూ.లక్ష, ద్వితీయ రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
News August 14, 2025
మధ్యప్రదేశ్‌లో యాక్సిడెంట్.. బెల్లంపల్లిలో విషాదం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన వ్యాపారి మహేందర్ చౌదరి కుమారుడు అరవింద్ చౌదరి(10)విద్యార్థి మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. స్వగ్రామమైన రాజస్థాన్‌కు కారులో వెళుతుండగా MPలో వెనుక నుంచి అజాగ్రత్తగా, అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో అరవింద్ అక్కడికక్కడే మరణించగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
News August 14, 2025
3 దశాబ్దాల తర్వాత నచ్చినవారికి ఓటేశారు: పవన్

AP: మూడు దశాబ్దాల తర్వాత పులివెందులలో ఓటర్లు తమకు నచ్చిన వారికి ఓటేశారని Dy.CM పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల్లో గెలిచినవారికి అభినందనలు తెలిపారు. ‘గతంలో అక్కడ నామినేషన్లు కూడా వేయనీయలేదు. వేద్దామనుకున్నవారిపై దాడులకు తెగబడ్డారు. ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి’ అని పేర్కొన్నారు.