News June 13, 2024

ప్రభుత్వ బడుల్లో సమస్యల పరిష్కారం మాది: మంత్రి రాజనర్సింహ

image

‘ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం టీచర్లుగా మీ బాధ్యత’ అని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాయికోడ్‌లో బుధవారం నిర్వహించిన ‘బడి బాట’లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులపై ప్రజల ఆలోచన విధానం మార్చుకోవాలని, ఆ బడులు మనవి అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలని సూచించారు. ప్రైవేటుకు దీటుగా విద్య బోధన కొనసాగేలా చూడాలని కోరారు.

Similar News

News December 15, 2025

మెదక్: 12 చోట్ల ఉప సర్పంచ్ ఎన్నికలు

image

మెదక్ జిల్లాలో నిన్న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ ఎన్నిక జరగనిచోట ఈరోజు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 142 పంచాయతీలలో ఎన్నికలు జరగ్గా 12 చోట్ల ఉపసర్పంచ్ ఎన్నికలు కొన్ని అనివార్య కారణాలవల్ల జరగలేదని డీపీఓ యాదయ్య తెలిపారు. ఈరోజు వార్డు సభ్యులకు నోటీసు జారీ చేసి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు.

News December 15, 2025

చేగుంట: 4 ఓట్ల తేడాతో గెలుపు

image

చేగుంట మండలం పోలంపల్లి సర్పంచిగా కొండి రాజ్యలక్ష్మి విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి రాజ్యలక్ష్మి సమీప ప్రత్యర్థి తప్ప మేనకపై 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

News December 15, 2025

శివంపేట: ఓట్ల కోసం బట్టలు ఉతుకుతూ ప్రచారం

image

శివంపేట మండలం అల్లీపూర్ గ్రామ 1వ వార్డులో వార్డు సభ్యురాలి భర్త చాకలి బాబు వినూత్నంగా ప్రచారం చేశారు. తన భార్య తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి మహిళలతో కలిసి బట్టలు ఉతుకుతూ, గ్రామంలోని సమస్యలపై చర్చిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఈ వింత ప్రచారం అల్లీపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆసక్తిని రేకెత్తించింది.