News April 19, 2025

ప్రభుత్వ భవనాల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

image

గిరిజన కుటుంబాలకు రూఫ్ టాప్ కింద సోలార్‌తో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. వారికి ఆయుష్మాన్ భారత్ కార్డులు పెండింగ్ లేకుండా పంపిణీ చేయాలన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద అర్హతలతో గుర్తించబడిన వారికి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల భవనాలకు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలన్నారు.

Similar News

News February 19, 2026

మంత్రి లోకేశ్‌తో పరిటాల కుటుంబ సభ్యులు

image

మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతల విందులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ దంపతులు పాల్గొన్నారు. విందు స్వీకరించి నియోజకవర్గ సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం పరిటాల సునీత, శ్రీరామ్ సతీమణి జ్ఞానకు నారా లోకేశ్ పట్టు చీరలు అందజేశారు.

News February 19, 2026

‘మార్చి 31లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’

image

అనంతపురం జిల్లాలో వివిధ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఎం స్కీం పనులు సకాలంలో పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నాణ్యతతో పనులను గడువులోగా ముగించాలని అధికారులకు సూచించారు.