News March 20, 2024

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికారులు చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మైనింగ్ అనుమతులకు రెవెన్యూ అధికారుల ఎల్ఓసి తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News July 3, 2024

MDK: నేటితో ముగియనున్న పదవీ కాలం

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో MPTC సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. 2019 మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. జులై 3న మండల పరిషత్, 4న జిల్లా పరిషత్‌కు పాలకవర్గాలు కొలువుదీరాయి. 5ఏళ్ల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించనుంది. మెదక్ జిల్లాలో 189 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.

News July 3, 2024

సిద్దిపేట: జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం

image

అటవీ హద్దులను నిర్ధారించుటకు, ఆక్రమణలను తొలగించుటకు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 23,738 హెక్టార్ల అటవీ విస్తీర్ణం 77 ప్రాంతాలలో ఉందని అన్నారు.

News July 2, 2024

సంగారెడ్డి: 45 మంది ఉపాధ్యాయుల బదిలీ

image

సంగారెడ్డి జిల్లాలో 45 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. లాంగ్వేజ్ పండిట్ తెలుగు 11, హిందీ 22, ఉర్దూ 1, పీఈటీలు 11 మంది బదిలీ అయినట్లు చెప్పారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పాఠశాలలలో ఈ నెల 3వ తేదీన చేరాలని సూచించారు.