News June 25, 2024

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలు గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో ఫెన్సింగ్ వేయించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పాల్గొన్నారు.

Similar News

News December 30, 2025

జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకం: మెదక్ అదనపు కలెక్టర్

image

పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకమని అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ అన్నారు. సమాచార హక్కు చట్టం-2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పౌరులకు చట్టం విధానాలు, దరఖాస్తు ప్రక్రియ, సమాచారం పొందే హక్కులు గురించి వివరంగా తెలియజేశారు. పౌర సమాచార అధికారులు (PIO), సహాయ PIOలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం అందించాలన్నారు.

News December 30, 2025

నర్సాపూర్: తండ్రిని పొడిచిన కొడుకుకు ఏడేళ్ల జైలు శిక్ష

image

నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో ఆస్తి పంపకం చేయాలని తండ్రి దశరథను కత్తితో పొడిచిన కొడుకు నాగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి సుభావల్లి తీర్పునిచ్చినట్లు ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు తెలిపారు. నేరస్థుడికి శిక్షపడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

News December 30, 2025

మెదక్: ‘పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కఠిన చర్యలు’

image

ఆపరేషన్ స్మైల్-12 కార్యక్రమంలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ శాఖల సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో పని చేస్తున్న పిల్లలను, తప్పిపోయిన పిల్లలను గుర్తించి రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు.