News September 19, 2024
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సర్వే చేయండి: కలెక్టర్
గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 17న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణల అంశాన్ని తీసుకువెళ్లారు.
Similar News
News November 10, 2024
ఇంటింటికి స్టిక్కరింగ్ వేయడం పూర్తి చేశాం: వరంగల్ కలెక్టర్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహిస్తూ గణకులు అందరి వివరాలు సేకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. శనివారం వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పరిశీలించి పటిష్టంగా నిర్వహించడానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేలో భాగంగా ఇంటింటికి స్టిక్కరింగ్ పూర్తి చేశామన్నారు.
News November 10, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> JN: కొడకండ్లలో యాక్సిడెంట్..
> WGL: మత్తు పదార్థాలు సేవించి వాహనాల నడపొద్దు..
> MHBD: కామెర్లతో యువకుడు మృతి..
> HNK: న్యాయం చేయాలని ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన
> BHPL: గుర్రంపేటలో హత్య
> MLG: పారిపోయిన బాలిక.. గంటలో గుర్తించిన పోలీసులు
> HNK: దోపిడి ముఠా అరెస్ట్
> WGL: డ్రైనేజీలోకి హోటల్ వ్యర్థాలు
News November 9, 2024
నెల్లికుదురులో రెండు తలలతో జన్మించిన గొర్రె పిల్ల
రెండు తలలతో గొర్రె పిల్ల జన్మించిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. నెల్లికుదురు గ్రామానికి చెందిన కావటి పిచ్చయ్య యాదవ్‌కు చెందిన గొర్రెల మందలో ఒక గొర్రెకు రెండు తలలతో వింత గొర్రె పిల్ల పుట్టింది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు తండోపతండాలుగా వచ్చి దానిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా ఇది జన్యులోపమని పలువురు పేర్కొన్నారు.