News February 7, 2025

ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌టిష్ఠ చ‌ర్య‌లు: కలెక్టర్

image

ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు రెవెన్యూ అధికారులు ప‌టిష్ఠ చ‌ర్య‌లు చేప‌ట్టాలని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో భీమిలి డివిజ‌న్ రెవెన్యూ అధికారులతో కాన్ఫెరెన్స్‌లో సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులపై రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. అన్యాక్రాంతానికి గురైన భూముల‌ను గుర్తించి త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

Similar News

News February 6, 2025

‘ఇంటింటికీ వెళ్లి అంగవైకల్యం గల చిన్నారులను గుర్తించాలి’

image

విశాఖ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ అవగాహన నిర్వహించారు. ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు సిబ్బంది ఇంటింటికి వెళ్లి అంగవైకల్యం గల చిన్నారులను గుర్తించాలన్నారు. మానసికంగా, శారీరకంగా వైకల్యం ఉన్న పిల్లలకు వైద్యం అందిస్తే చిన్నతనంలోనే మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంంటుందన్నార. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.

News February 6, 2025

భీమిలి: ఇన్‌స్టాలో పవన్‌ను తిట్టిన వ్యక్తిపై కేసు

image

తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో Dy CM పవన్ కళ్యాణ్‌‌ను తిడుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టిన భీమిలి మండలం జీరుపేట గ్రామానికి చెందిన వ్యక్తిపై కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 2న జీరు వీరుబాబు పెట్టిన పోస్టుపై విజయవాడకు చెందిన TDP బూత్ కన్వీనర్ హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమిలి పోలీసుల సాయంతో గవర్నర్‌పేట పోలీసులు వీరబాబును బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

News February 6, 2025

‘ఈగల్’ వింగ్ విశాఖ సీఐగా ఎస్.రమేశ్

image

విశాఖపట్నం జిల్లా జోనల్ “ఈగల్” వింగ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్‌గా ఎస్.రమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ జరిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1972కి డయల్ చేయాలని ప్రజలకు సూచించారు. ఈయన విశాఖ జిల్లాలో 2010 నుంచి 2022 వరకు పలు విభాగలలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు.

error: Content is protected !!