News February 20, 2026
ప్రభుత్వ లక్ష్యాల అమలుపై కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో ప్రజల సంతృప్తి పెంచేలా అధికారులు సమగ్రంగా పనిచేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పబ్లిక్ పర్సెప్షన్, స్వర్ణాంధ్ర-స్వచ్ఛఆంధ్ర, ఐగాట్ కర్మయోగి వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆత్మకూరు, బనగానపల్లె, నంద్యాల బస్ స్టేషన్ల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో డాక్యుమెంటేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Similar News
News February 21, 2026
రావులపాడు కాలువలో మృతదేహం కలకలం

రావులపాడు వద్ద బొబ్బర్లంక ముక్కామల ప్రధాన పంట కాలువలో సుమారు 50–55 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. స్థానిక వీఆర్వో ఇచ్చిన సమాచారంతో రావులపాలెం టౌన్ ఎస్సై రమణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్సై కోరారు.
News February 21, 2026
గద్వాల: దివ్యాంగుల గ్రీవెన్స్ డేకు 37 దరఖాస్తులు

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు గద్వాల కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో 37 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని, వారి సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. ఇకపై ప్రతి నెలలో మూడో శనివారం దివ్యాంగుల గ్రీవెన్స్ డే నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 21, 2026
నేత్రాలు మానవ మనుగడకు జీవనాధారం: ధర్మచరణ్

అభయ ఛారిటబుల్ ట్రస్ట్ శనివారం ఉచిత కంటి, దంత వైద్యపరీక్షలు నిర్వహించింది. రెడ్డిపాలెంలోని వేదసీడ్స్ కార్యాలయంలో మెడెక్స్ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం జరిగింది. డాక్టర్ పొట్లూరి అపర్ణ వైద్యబృందం కంటి, దంత పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. వేదసీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసీ ధర్మచరణ్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన నేత్రాలే మానవాళి మనుగడకు జీవనాధారం అని అన్నారు.


