News November 19, 2025

ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించండి

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. మంగళవారం ఐడిఓసి సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు చలి కాలంలో ఇబ్బందులు లేకుండా కిటికీలు మరమ్మతులు చేయించుకోవాలన్నారు.

Similar News

News April 5, 2026

కామారెడ్డి: వరి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష నిర్వహించారు. MSP ప్రకారం గ్రేడ్-1 వరికి రూ.2,389, సాధారణ వరికి రూ.2,369కు కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో తగిన సదుపాయాలు అందించాలన్నారు.

News April 5, 2026

TU: ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు వాయిదా

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8, 10 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను పలు సాంకేతిక కారణాల రీత్యా వాయిదా వేశారు. దీంతో శనివారం నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల రీ షెడ్యూల్‌ను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.

News April 5, 2026

టెస్టులపై BCCI ఫోకస్.. తర్వాతి తరాన్ని సిద్ధం చేసేందుకు ప్లాన్!

image

NZ, SAతో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లు ఓడటంతో BCCI రెడ్ బాల్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టింది. జూన్/జులైలో 64 మంది U25 క్రికెటర్లతో రెడ్ బాల్ ఇంట్రా టోర్నీ నిర్వహించనుంది. వారిని 4 జట్లుగా విభజించి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో మ్యాచులు ఆడించనున్నట్లు BCCI అధికారి ఒకరు తెలిపారు. ఇందులోనుంచి 25 మందిని సెలక్ట్ చేసి టెస్టుల కోసం సిద్ధం చేస్తారు. ఈ లిస్టులో వైభవ్, మాత్రే కూడా ఉంటారని సమాచారం.