News January 19, 2025

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి: ఏఐవైఎఫ్

image

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు డిమాండ్ చేశారు. వచ్చే నెల 6, 7, 8, 9వ తేదీలలో శ్రీకాకుళంలో జరిగే ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలకు నంద్యాల జిల్లా నుంచి యువతీ, యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం నంద్యాలలోని సీపీఐ కార్యాలయంలో నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.

Similar News

News January 19, 2025

9వ రోజు 246 మంది అభ్యర్థుల ఎంపిక

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలులోని ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో 9వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 600 మంది అభ్యర్థులకు గాను 338 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హజరయ్యారన్నారు. ఫైనల్ పరీక్షకు 246 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఎస్పీ తెలిపారు.

News January 19, 2025

హత్య కేసులో ఏడుగురు అరెస్ట్: డీఎస్పీ

image

చిప్పగిరి మండలం బంటనహాల్ గ్రామంలో ఖాజీపురం రామాంజనేయులు హత్య కేసులో ప్రధాన నిందితులు తలారి సురేశ్, కృష్ణమూర్తితో పాటు మరో ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. ఆలూరు సీఐ వెంకట చలపతి, ఎస్ఐ సతీశ్ కుమార్‌తో కలిసి మీడియా ముందు వివరాలు వెల్లడించారు. ముద్దాయిలను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

News January 18, 2025

పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్

image

నంద్యాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లను శనివారం DAHO డా.గోవింద్ నాయక్‌తో కలిసి కలెక్టర్ జీ.రాజకుమారి ఆవిష్కరించారు. ఈనెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని వివిధ గ్రామాల్లో నిర్వహించే ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతుల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.