News February 16, 2026
ప్రభుత్వ సాయం ఎక్కడ?(3/3)

ఈ పరిస్ధితుల్లో రైతులు ప్రతి దానికి సిండికేట్లను, దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. కనీసం చెరువుల నీటి పరీక్షలకు కూడా ప్రైవేటునే రైతులు ఆశ్రయిస్తున్నారు. ఆకివీడులో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్వా ల్యాబ్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. ల్యాబ్‌లో ఒక్క పరికరమూ పనిచేస్తున్న పాపాన పోవడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆక్వా రైతులను ఆదుకోకుంటే భవిష్యత్తులో ఆక్వా రంగం మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది.
Similar News
News February 16, 2026
గుంటూరులో ఫలితాలలో షాక్.. D గ్రేడ్‌లో 2,123 మంది విద్యార్థులు

SSC 100 రోజుల యాక్షన్ ప్లాన్ సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 ఫలితాల్లో గుంటూరు జిల్లా మిశ్రమ ఫలితాలు సాధించింది. మొత్తం 10,332 మంది విద్యార్థుల్లో 568 మంది A గ్రేడ్, 2,239 మంది B గ్రేడ్, 4,912 మంది C గ్రేడ్ సాధించగా, 2,123 మంది D గ్రేడ్‌లో నిలిచారు. D గ్రేడ్ శాతం గణనీయంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యాశాఖ 46 పరీక్షల మూల్యాంకనం ద్వారా మెరుగుదలపై దృష్టి సారించింది.
News February 16, 2026
ములుగు: సాధారణ గృహిణి నుంచి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా..!

వ్యవసాయ పనులు చేసుకుంటూ సాధారణ గృహిణిగా ఇంటిని చక్కదిద్దుకున్న చింతనిప్పుల చంద్రకళ అనూహ్యంగా ములుగు మున్సిపాలిటీ తొలి ఛైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించారు. ఆమె భర్త భిక్షపతి 20 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. మొదటి నుంచి సీతక్క వెన్నంటే ఉంటూ ఆయన పని చేశారు. భర్త ప్రోత్సాహంతో జనరల్ స్థానమైన 6వ వార్డు నుంచి పోటీ చేసిన చంద్రకళ కేవలం 8 ఓట్ల స్వల్ప మెజార్టీతో సంచలన విజయం సాధించారు.
News February 16, 2026
TU: పీజీ పరీక్షలు వాయిదా.. రీ షెడ్యూల్

TU పరిధిలో పీజీ (MA/MSW/MCom/MSc/MBA/MCA), ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH/IMBA) మొదటి, IMBA 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు వాయిదా పడ్డాయని COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈనెల 17 నుంచి మార్చి 2 వరకు జరగాల్సిన పరీక్షలు ఈ నెల 26 నుంచి మార్చి 11 వరకు రీ షెడ్యూల్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గం.ల నుంచి 5గం.ల వరకు జరగనున్నాయన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.


