News March 18, 2025
ప్రభుత్వ స్థలాలను గుర్తించండి: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాలో అభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యుత్ సబ్ స్టేషన్లకు 5 నుంచి 10 ఎకరాలు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు 50 నుంచి 100 ఎకరాలను గుర్తించాలని సూచించారు.
Similar News
News July 6, 2025
MNJ కేన్సర్ ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు

MNJ కేన్సర్ ఆస్పత్రిలో ఇక మెరుగైన వైద్య సేవలందనున్నాయి. ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయిస్తూ మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ కేన్సర్ బాధితులు పెరిగిపోతుండటంతో లక్డీకపూల్(రెడ్ హిల్స్)లో ఉన్న MNJలో పేషెంట్లు చికిత్సకు ఇబ్బందులు ఏర్పడకుండా బోర్డు వీరిని నియమించింది.
News July 6, 2025
మహిళల రక్షణ కోసం ‘SWAT’ బృందం

HYD నగర పోలీసులు మహిళల భద్రత, నిరసన ప్రదర్శనల నిర్వహణ కోసం 35 మంది మహిళా పోలీసులతో “స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్(SWAT)”ను ప్రారంభించారు. కరాటే, నిరాయుధ పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ బృందం ధర్నాలు, ర్యాలీలు, ముఖ్యమైన ఈవెంట్లు, పండుగల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తుంది. సరికొత్త యూనిఫాంలో సచివాలయం వద్ద విధుల్లో చేరిన ఈ బృందం.. మహిళల ఆందోళనలు నియంత్రించడంలో కీలకపాత్ర పోషించనుంది.
News July 6, 2025
విజయవాడ: భక్తులతో కిటకిటలాడిన కనకదుర్గమ్మ ఆలయం

ఆషాడ మాసపు చివరి ఆదివారం, తొలి ఏకాదశి కావడంతో కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వందలాది సారె బృందాలు అమ్మవారిని దర్శించుకున్నాయి. మహా మండపం ఆరవ అంతస్తులో శాకాంబరీ ఉత్సవాలకు భక్తులు సమర్పించిన కాయగూరలు, పండ్లను ఈవో శీనా నాయక్ పరిశీలించారు. సారె బృందాల కోసం లిఫ్ట్, దర్శన మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.