News November 11, 2025

ప్రమాదం.. వ్యక్తిని కాపాడిన స్మార్ట్ వాచ్

image

మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు స్మార్ట్ వాచ్ ఎలా సహాయపడుతుందో తెలిపే ఘటనే ఇది. ఓ వ్యక్తికి తీవ్ర ప్రమాదం జరిగినప్పుడు అతడి చేతికి ఆపిల్ వాచ్ ఉంది. BP, పల్స్ పడిపోవడాన్ని వాచ్ గ్రహించి ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేసింది. అతడి లొకేషన్‌ను కొడుకుకు & అంబులెన్స్‌కు హెచ్చరిక సందేశాన్ని పంపింది. బాధితుడు క్షేమంగా బయటపడ్డారు. అత్యవసర SOS ఫీచర్‌లు యాపిల్‌తో పాటు Samsung & Google Pixel వాచ్‌ల్లోనూ ఉన్నాయి.

Similar News

News November 11, 2025

హార్ట్ బ్రేకింగ్.. బాంబ్ బ్లాస్ట్‌తో కుటుంబం రోడ్డుపైకి!

image

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్‌లో మరణించినవారిలో కుటుంబానికి ఏకైక ఆధారమైన అశోక్ కూడా ఉన్నారు. మొత్తం కుటుంబంలో 8 మంది ఆయన సంపాదన మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు కాగా.. అందులో ముగ్గురు ఆడపిల్లలు, ఓ అబ్బాయి. తల్లితో పాటు అనారోగ్యంతో ఉన్న అన్నయ్య పోషణను కూడా అశోక్‌ చూసుకుంటున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది రావొద్దని ఆయన పగటిపూట కండక్టర్‌గా, రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు.

News November 11, 2025

ఏపీ వారికీ నేను మామనే: శివరాజ్‌సింగ్

image

AP: మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చెప్పారు. వాటర్‌షెడ్ పథకం కింద గుంటూరు(D) వెంగళాయపాలెం చెరువు పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ‘దీనిద్వారా భూగర్భజలాలు పెరగడంతోపాటు పశువులకు తాగునీరు లభిస్తుంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చెరువులను అభివృద్ధి చేస్తాం. మధ్యప్రదేశ్ ప్రజలు నన్ను మామ అంటారు. ఇకపై AP వారికీ మామనే’ అని వ్యాఖ్యానించారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది. త్వరలో పేలుడు ఘటనపై NIA అధికారులు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.