News June 23, 2024

ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

image

 గోదావరి నదిలో ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. రాములవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా గోదావరిలో స్నానం ఆచరిస్తారని.. భక్తులు స్థానాలు చేసే ప్రదేశాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. శనివారం గోదావరిలో మునిగి బాలుడు మృతి చెందడంతో ఆ ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 7, 2024

విద్యుత్ షాక్‌తో బాలిక మృతి

image

గుండాల మండలంలో విద్యుత్ షాక్‌తో బాలిక మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. వెన్నెలబైలు గ్రామానికి చెందిన కృష్ణారావు, సుమలత దంపతుల కుమార్తె సువర్ణ (12). ఆదివారం సాయంత్రం ఇంట్లో కరెంట్ వైరు తెగి ఐరన్ తలుపులపై పడింది. అది గమనించని సువర్ణ ఇంట్లోకి వెళుతూ తలుపులను తాకింది. దీంతో షాక్‌కు గురై మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News October 7, 2024

అశ్వారావుపేట: కరెన్సీ నోట్లతో మండపం

image

అశ్వారావుపేట మండలం నాయీబ్రహ్మణ సంఘం బజారులోని నాయీబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గామాత మండపాన్ని అందంగా అలంకరించారు. 4వ రోజు ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఏకంగా కొన్ని లక్షల ఫేక్ కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు. మండపం మొత్తం కరెన్సీ నోట్లతో కళకళలాడుతోంది.

News October 7, 2024

‘డీఎస్సీ 2008 ఏజెన్సీ అభ్యర్థుల జాబితా సవరించాలి’

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్సీ 2008 అర్హుల జాబితాలో తప్పులు చోటుచేసుకున్నాయని, వాటిని సవరించి కొత్త జాబితా విడుదల చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర నాయకులు కల్తి రాంప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం కారేపల్లిలో జరిగిన డీఎస్సీ 2008 బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ఏరియా గిరిజన అభ్యర్థుల లిస్టుల తయారీలో జరిగిన తప్పిదాన్ని అధికారులు గుర్తించాలన్నారు.