News March 31, 2026

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో రసాయనాల ఉత్పత్తుల పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరిశ్రమల యజమానులు, అధికారులతో ప్రమాదాల నివారణపై సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో అధికారుల సమక్షంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ప్రమాదాల నివారణపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రమాదాలలో ఇతర నిర్మాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News April 14, 2026

చిత్తూరు: పుంజుకుంటున్న టమాటా ధరలు

image

సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న టమాట రైతులకు ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. పలమనేరులో సోమవారం టమాటా బాక్సు (14 కిలోలు) ధర రూ.400 పలికింది. నాలుగు రోజుల కిందట బాక్సు రూ.200 ఉండగా రోజుకి యాభై చొప్పున ధర పెరుగుతూ వస్తోంది. వేసవి ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడంతో ధర పెరుగుతోంది. మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వస్తున్నాయి.

News April 14, 2026

చిత్తూరు జిల్లా ‘మండుతోంది’

image

చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఏడు మండలాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటాయి. అత్యధికంగా తవణంపల్లెలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరి, రొంపిచెర్లలో 40.7, శ్రీరంగరాజపురంలో 40.6, నిండ్రలో 40.5, గంగవరంలో 40.3, విజయపురంలో 40.0, పెద్దపంజాణిలో 39.6, బంగారుపాళ్యం, పులిచెర్ల మండలాల్లో 39.5 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది.

News April 14, 2026

చిత్తూరు జిల్లాలో నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు

image

చిత్తూరు జిల్లాలో మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపక అధికారి పెద్దిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, అపార్టుమెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో అగ్నిప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. తద్వారా ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.