News November 6, 2024

ప్రమాదాల నివారణకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

image

పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలలో ప్రమాదం జరిగితే సంబంధిత తహశీల్దార్, ఆర్డీవోకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు.

Similar News

News December 29, 2025

సైదాపురం: బాలుడిని ఢీకొట్టిన టిప్పర్

image

సైదాపురం ST కాలనీ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగిలపాడు సమీపంలోని క్రషర్ నుంచి కంకర్ లోడుతో గూడూరు వైపు ఓ టిప్పర్ బయల్దేరింది. మార్గమధ్యంలో టిప్పర్ అదుపు తప్పి దక్షేశ్(5)పైకి దూసుకెళ్లింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 29, 2025

నెల్లూరులోకి గూడూరు.. ఆ రెండు తిరుపతిలోనే!

image

గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నెల్లూరులో కలపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. CM చంద్రబాబుతో ఆదివారం జరిగిన చర్చల్లో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చిందంట. గూడూరు, కోట, చిల్లకూరు మండలాలనే నెల్లూరులో కలిపి.. వాకాడు, చిట్టమూరును తిరుపతి జిల్లాలో కొనసాగిస్తారని సమాచారం. నేటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత అధికార ప్రకటన చేయనున్నారు.

News December 28, 2025

STలకు రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు: DSO

image

జిల్లా వ్యాప్తంగా రేషన్, గ్యాస్ కనెక్షన్ లేని ఎస్టీలు వందల సంఖ్యలో ఉన్నారని, వారికి త్వరలోనే కార్డులు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను డీఎస్ఓ లీలారాణి ఆదేశించారు. ఇటీవల సంభవించిన తుఫాన్ ధాటికి అధిక సంఖ్యలో ఎస్టీలు దెబ్బతిన్నారన్నారు. వారికి నిత్యవసర సరకులు పంపిణీ చేసే క్రమంలో రేషన్ కార్డు లేకపోవడం గుర్తించామన్నారు.