News December 27, 2025
ప్రమాదాల నివారణపై ప్రత్యేక డ్రైవ్: ఎస్పీ

రహదారుల ప్రమాదాల నివారణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ శుక్రవారం తెలిపారు. రాత్రి 12 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 89 ప్రమాదాలు నమోదు కాగా, బాపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 50 కేసులు నమోదయాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News December 27, 2025
కర్నూలు జిల్లాలో 17,089 ఓపెన్ డ్రింకింగ్ కేసులు: ఎస్పీ

కర్నూలు జిల్లాలో బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 17,089 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇకపై బహిరంగ మద్యపానాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
News December 27, 2025
మేడారం జాతరకు హనుమకొండ నుంచి ప్రత్యేక బస్సులు

హనుమకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ -2 డిపో మేనేజర్ రవి చందర్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి స్పెషల్ సర్వీస్‌లు ప్రారంభమవుతాయని, ప్రయాణికుల రద్దీని బట్టి పెంచుతామని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులో వెళ్తే సమ్మక్క, సారక్క గద్దెల వరకు చేరుకోవచ్చన్నారు. వివరాల కోసం 73824 25150 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News December 27, 2025
ఈ ఏడాది రూ.500కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే!

భారతీయ చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది 5 సినిమాలు ఒక్కోటి రూ.500 కోట్లకు పైగా కొల్లగొట్టాయి. వాటిలో ఛావా, కాంతారా చాప్టర్-1, సైయారా, కూలీ, ధురంధర్ చిత్రాలున్నాయి. అటు కొన్నేళ్లుగా హిట్ మూవీలు లేక డీలా పడిన బాలీవుడ్‌కు ఫిబ్రవరిలో వచ్చిన ఛావా, ఏడాది చివర్లో ధురంధర్ సినిమాలు జోష్ నింపాయి. మరోవైపు దేశంలో ఇప్పటి వరకు రూ.1,000 కోట్లు సాధించిన మూవీలు 8 ఉండగా, తాజాగా ఆ లిస్టులో ధురంధర్ చేరింది.


