News December 22, 2025
ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ ఆత్మహత్య

హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. ‘It: Chapter Two’, ‘The Black Phone’ వంటి చిత్రాలతో పాటు పలు సిరీస్‌ల్లోనూ ఆయన నటించారు. ప్రముఖ టీవీ సిరీస్ ‘The Wire’లో జిగ్గీ సోబోట్కా పాత్రతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జన్మించిన రాన్సోన్ గత కొంతకాలంగా వ్యక్తిగత, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీటి గురించి ఆయనే స్వయంగా పలుమార్లు తెలిపారు.
Similar News
News December 31, 2025
నిమెసులైడ్ తయారీ, సేల్స్‌పైనా కేంద్రం ఆంక్షలు

పెయిన్‌కిల్లర్ నిమెసులైడ్ తయారీ, సేల్స్‌పై కేంద్రం ఆంక్షలు విధించింది. 100mg కంటే ఎక్కువ పవర్ ఉండే ఈ మెడిసిన్ తయారీని వెంటనే ఆపేయాలని ఆదేశాలిచ్చింది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుతో చర్చల తర్వాత హెల్త్ మినిస్ట్రీ నోటిఫికేషన్ ఇచ్చింది. ‘100mg కంటే ఎక్కువ డోస్ ఉండే నిమెసులైడ్ లివర్‌కు ప్రమాదం. దీనికి ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నాయి. దీనిపై తక్షణమే నిషేధం విధిస్తున్నాం’ అని పేర్కొంది.
News December 31, 2025
చీని, నిమ్మ తోటల్లో ఎగిరే పేను బెడద

చీని, నిమ్మ తోటల్లో కొన్నేళ్లుగా ఎగిరేపేను ఉద్ధృతి కనిపిస్తోంది. ఈ పురుగులు లేత ఆకులు, పూతను ఆశించి రసం పీల్చడం వల్ల ఆకులు వాడిపోయి, వంకర్లు తిరగడంతో పాటు పూత కూడా రాలిపోతోంది. దీని వల్ల మొక్కల పెరుగుదల ఆగిపోయి కొమ్మలు పై నుంచి కిందకు ఎండిపోతాయి. రసం పీల్చడం వల్ల ఆకులు, కాయలపై జిగురు వంటి పదార్థం విడుదలై నల్లని బూజు ఏర్పడుతుంది. ఎగిరే పేను వల్ల చీని, నిమ్మ తోటల్లో శంకు తెగులు కూడా వ్యాపిస్తుంది.
News December 31, 2025
IISER తిరుపతిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో 22 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు FEB 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, MBBS, MD, PG, MSc, MCA, BS-MS, M.LSc, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్/స్కిల్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iisertirupati.ac.in


