News November 19, 2025
ప్రయాణాలు చేయొద్దని గిల్‌కు డాక్టర్ల సూచన: క్రీడా వర్గాలు

మెడ నొప్పితో బాధపడుతున్న టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ నెల 22 నుంచి SAతో జరిగే రెండో టెస్టులో ఆడే అవకాశాలు కనిపించట్లేదు. ప్రయాణాలు చేయొద్దని ఆయనకు మెడికల్ టీమ్ సూచించినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ట్రావెల్ చేస్తే గాయం తీవ్రత పెరిగి, దీర్ఘకాలిక సమస్యగా మారొచ్చని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. రెండో టెస్టులో గిల్‌ను ఆడించాలా వద్దా అనే దానిపై ఈనెల 21న నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Similar News
News April 5, 2026
సంగారెడ్డి: ఉచిత శిక్షణ.. APPLY

స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఫ్రిజ్ & ఏసీ రిపేర్ &సర్వీసింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్న సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ యువకులు అర్హులని చెప్పారు. దరఖాస్తులలో బైపాస్ రహదారిలోని కార్యాలయంలో గాని, 94901 03390 నంబర్‌కు వాట్సప్ చేయాలని సూచించారు.
News April 5, 2026
రత్నమైనా, పద్యమైనా.. విలువ దేనికంటే?

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: శ్రేష్ఠమైన నీలి రంగు రత్నం ఒక్కటి ఉన్నా చాలు. దానికి ఎంతో విలువ ఉంటుంది. తళతళ మెరిసే రాళ్లు తట్టెడు ఉన్నా ఉపయోగం లేదు. అలాగే రసవంతమైన, అర్థవంతమైన పద్యం ఒక్కటున్నా చాలు. వేల సంఖ్యలో అర్థం లేని పద్యాలతో మంచి జరగదు.<<-se>>#PADHYAM<<>>
News April 5, 2026
TG EAPCETకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే

తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల (లేట్ ఫీజు లేకుండా) గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2,89,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 53.34% మంది అమ్మాయిలు, 46.66% మంది అబ్బాయిలు ఉన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమింగ్‌కు 2,03,167 అప్లికేషన్లు వచ్చాయి. నేటి నుంచి ఈ నెల 10 వరకు రూ.250 లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు EAPCET <


