News April 10, 2024

ప్రలోభాలుంటే సమాచారం ఇవ్వండి: ఏలూరు ఎస్పీ

image

ఏలూరు జిల్లాలో సోమవారం సాయంత్రం 7గంటల నుంచి మంగళవారం సాయంత్రం 7 వరకు రూ.22 వేల విలువ కలిగిన 88.60 లీటర్ల మద్యం, బెల్లం ఊట-1200 లీటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ.7,61,460 నగదును సీజ్ చేశారని ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. ప్రలోభాలకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.

Similar News

News September 29, 2024

జగన్‌కు పరిపాలన చేయడం రాదు: మంత్రి నారాయణ

image

ఏపీ మాజీ సీఎం జగన్‌కు పరిపాలన చేయడం రాదని మంత్రి నారాయణ అన్నారు. పాలకొల్లు టిడ్కో ఇళ్ల వద్ద మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చైనా పర్వాలేదని సీఎం చంద్రబాబు అన్నారని చెప్పారు. పాలకొల్లులోని ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.

News September 29, 2024

ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై చీటింగ్ కేసు

image

ఏలూరు మాజీ MLA ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదైంది. త్రీ-టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచార సమయంలో ఏలూరులోని ఓ అపార్ట్మెంట్‌లో లిఫ్ట్ దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడిన తనను ఆదుకుంటానని, వైద్య ఖర్చులు భరిస్తానని చెప్పిన ఆళ్ల నాని.. ఆ తర్వాత పట్టించుకోలేదని అవుటుపల్లి నాగమణి అనే మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో నానితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామన్నారు.

News September 29, 2024

TDP ఉభయ గోదావరి జిల్లాల MLC అభ్యర్థి ఖరారు..?

image

TDP ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. కాపు లేదా SC సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి జవహర్‌‌తో పాటు పలువురి పేర్లు పరిశీలించినా, చివరికి ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్‌కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐ.పోలవరానికి చెందిన రాజశేఖర్ కాకినాడ రూరల్ అసెంబ్లీ టికెట్ ఆశించగా జనసేనకు ఇచ్చారు.