News August 16, 2025
ప్రశంస పత్రం అందుకున్న సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి శుక్రవారం ప్రశంసా పత్రం అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి గితేలు అందించారు. ఈ సందర్భంగా సీఐ మొగిలిని పలువురు అభినందించారు.
Similar News
News August 16, 2025
చిన్నారుట్ల గూడెంలో చిరుతపులి కదలికలపై నిరంతర నిఘా

శ్రీశైలం – దోర్నాల మార్గమధ్యంలోని చిన్నారుట్లా గిరిజన గూడెంలో బాలికపై చిరుతపులి దాడి చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కదలికల కోసం అన్ని ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత సంచరించే అవకాశం ఉన్నందున దాని కదలికలను పర్యవేక్షిస్తూ తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు దోర్నాల రేంజర్ హరి పేర్కొన్నారు. చెంచు గిరిజనులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు.
News August 16, 2025
ఆకివీడు: కండక్టర్‌గా మారిన RRR

‘స్త్రీ శక్తి’ పథకాన్ని డిప్యూటీ స్పీకర్ RRR శుక్రవారం దుంపగడపలో ప్రారంభించారు. కండక్టర్‌గా మారి, కాసేపు మహిళలకు ఉచిత టికెట్లు ఇచ్చారు. ప్రభుత్వం మహిళాభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 297 బస్సులకు గాను 225 బస్సులు ఈ పథకంలో సేవలందిస్తున్నాయని, ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించిందని ఆయన వివరించారు.
News August 16, 2025
పెందుర్తిలో అత్యధిక వర్షపాతం నమోదు

పెందుర్తిలోని అత్యధికంగా వర్షపాతం నమోదయింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెందుర్తి పరిసర ప్రాంతాల్లోనీ 66.4 మీ.మీ.వర్షపాతం నమోదయింది. పద్మనాభంలో 28.6 మీ. మీ, ఆనందపురం 15.6 మీ.మీ, ములగాడ 8.2 మీ.మీ., గోపాలపట్నం 7.4 మీ. మీ, విశాఖపట్నం రూరల్ 6.8.మీ.మీ వర్షం పడింది. ఇల్లా వ్యాప్తంగా 24 గంటల్లో 162.0 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.