News February 28, 2025
ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు : WGL కలెక్టర్

ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 2,352 మంది ఓటర్లకు 94.13 శాతం ఓటేశారని పేర్కొన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా బ్యాలెట్ పత్రాలను భారీ బందోబస్తు మధ్య నల్గొండ జిల్లాకు తరలించారని తెలిపారు.
Similar News
News February 28, 2025
వరంగల్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగింది. సీఐ రాఘవేందర్ కథనం ప్రకారం.. బాలాజీనగర్‌కి చెందిన జక్కోజు శివకృష్ణచారి(31)కూలీ పని చేస్తుండేవాడు. తరచు మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. నిన్న సాయంత్రం మద్యం తాగి వచ్చిన అనంతరం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. భార్య లావణ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్లు తెలిపారు.
News February 28, 2025
జిల్లాలో రాయపర్తిలోనే తక్కువ పోలింగ్

రాయపర్తి మండలంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో వరంగల్ జిల్లాలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. రాయపర్తి మండలంలో 66మంది ఓటర్లుండగా.. 60 మంది టీచర్లు ఓటును వినియోగించుకున్నారు. మొత్తంగా 90.90శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఎక్కువగా సంగెం మండలంలో 98.48శాతం నమోదైంది.
News February 28, 2025
వరంగల్: మీ మండలంలో ఎంత పోలింగ్ అయిందంటే..?

వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలో 94.13శాతం పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. వర్ధన్నపేట-97.83, రాయపర్తి-90.91, నెక్కొండ-97.18, ఖానాపురం-94.52, నర్సంపేట- 94.91, చెన్నారావుపేట-94.92, పర్వతగిరి-97.44, సంగెం-98.48, నల్లబెల్లి-95.24, దుగ్గొండి-91.67, గీసుకొండ-94.44, వరంగల్-93.07, ఖిల్లా వరంగల్-93.99