News September 7, 2025

ప్రశాంతంగా ముగిసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు: ఎస్పీ

image

ప్రశాంతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సహకరించిన గణపతి మండపాల నిర్వాహకులకు, హిందూ సంఘాలు, మిలాద్ ఉన్ నబీ కమిటీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్విరామంగా 11 రోజుల పాటు శ్రమించిన పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామన్నారు. రాత్రింబవళ్లు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సిబ్బంది పని చేశారన్నారు.

Similar News

News September 8, 2025

వనపర్తి: వాట్సాప్‌లో ఏపీకే ఫైల్స్‌తో జాగ్రత్త: ఎస్పీ

image

వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే అపరిచిత ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని ఎస్పీ రావుల గిరిధర్ ప్రజలకు సూచించారు. ఆఫర్లు, బహుమతుల పేరుతో వచ్చే ఈ ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేస్తే మీ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఫైల్స్ ద్వారా ఫోన్లలోకి వైరస్ చొరబడి డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

News September 8, 2025

రష్యాపై మరిన్ని సుంకాలు: ట్రంప్

image

రష్యాపై మరిన్ని సుంకాలు విధిస్తామని US అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ‘రష్యాపై సెకండ్ ఫేస్ టారిఫ్స్‌కు సిద్ధంగా ఉన్నారా?’ అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నేను రేడీగా ఉన్నాను’ అని ఆయన సమాధానమిచ్చారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా అదనపు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా వంటి దేశాలపై మరిన్ని సుంకాలు విధించాలని US ట్రెజరీ సెక్రటరీ<<17644290>> బెసెంట్<<>> కూడా అన్నారు.

News September 8, 2025

జ్వరమని వెళ్తే.. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి!

image

TG: కరీంనగర్‌లో దారుణం వెలుగు చూసింది. జగిత్యాల జిల్లాకు చెందిన యువతి జ్వరమొచ్చిందని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు సమాచారం. ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆమె నిద్రపోతున్నప్పుడు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.