News November 19, 2024
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్షలు: కలెక్టర్ తేజస్
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 16,543 మంది అభ్యర్థులకు గాను, 9,232 మంది హాజరు కాగా, 7,311 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. సగటున 55.8 శాతం హాజరు నమోదయ్యిందని అన్నారు. పరీక్షలకు విధులు నిర్వహించిన అధికారులకు, పోలీసు అధికారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.
Similar News
News January 29, 2025
నకిరేకల్: సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేత
నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3 నుండి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆలయ అర్చకులతో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
News January 28, 2025
యూరియా బ్లాక్‌లో అమ్మితే లైసెన్స్ రద్దు: ఇలా త్రిపాఠి
నల్గొండ జిల్లాలో ఫర్టిలైజర్ షాపుల యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం కనగల్ మండల కేంద్రంలో ఆ షాపులను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా బ్లాక్‌లో అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
News January 28, 2025
NLG: ఆ భూములకు రైతు భరోసా లేనట్లే!
రాష్ట్రంలో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభమైంది. కాగా NLG జిల్లాలో తొలిరోజు 31 మండలాలకు సంబంధించిన 35,568 మంది రైతులకు రూ. 46.93 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. NLG జిల్లా వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ద్వారా పెట్టుబడి కింద సాగుకు యోగ్యంగా లేని 12,040 ఎకరాల భూములకు కూడా రైతు భరోసా చెల్లించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ భూములకు రైతు భరోసా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.