News December 17, 2025

ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్- కలెక్టర్ సత్యప్రసాద్

image

జగిత్యాల జిల్లాలో 3విడతలలో భాగంగా 6 మండలాల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, ఎండపల్లి, బుగ్గారం, వెల్గటూర్ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఒంటిగంటలోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

Similar News

News December 20, 2025

అనకాపల్లికి సీఎం చంద్రబాబు

image

AP: CM చంద్రబాబు ఇవాళ అనకాపల్లి(D) తాళ్లపాలెంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తారు. బంగారయ్యపేటలో సంపద కేంద్రాన్ని పరిశీలిస్తారు. తాళ్లపాలెంలో ప్రజావేదిక సభ, ఉగ్గినపాలెంలో TDP నేతలతో భేటీ, అనకాపల్లిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అటు నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు Dy.CM పవన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు.

News December 20, 2025

MBNR: గ్రూప్-3 ఉద్యోగం సాధించిన అఖిల

image

MBNR జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థిని S.అఖిల గ్రూప్-3 ఫలితాలలో ఉద్యోగాన్ని సాధించారు. సీనియర్ అసిస్టెంట్ ట్రైబల్ వేల్ఫేర్ గురుకుల పోస్టుకు ఆమె ఎంపికైనట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. అఖిల ప్రతిభను జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి సునీత అభినందించారు. స్టడీ సర్కిల్‌లో అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకుని విజయం సాధించడం గర్వకారణమని వారు పేర్కొన్నారు.

News December 20, 2025

ధనుర్మాసంలో శ్రీవారికి సుప్రభాత సేవ జరపరా?

image

సాధారణంగా ఏడాది పొడవునా తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. కానీ ధనుర్మాసంలో ఈ సేవకు బదులుగా ‘తిరుప్పావై’ పఠనం నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం వంటిది. అందుకే ఈ నెలలో శ్రీవారిని నిద్రలేపేందుకు గోదాదేవి రచించిన దివ్య ప్రబంధ పాశురాలను వినిపిస్తారు. ఫలితంగా ఈ నెల రోజులు సుప్రభాత సేవ ఏకాంతంగా కూడా జరగదు. <<-se>>#VINAROBHAGYAMU<<>>