News March 13, 2025

ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండుగను జరుపుకునే వారు జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. యువత ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్లవద్దని, సాంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరమని అన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా సాంప్రదాయక పండుగలు ఏమైనా ప్రజలు కలిసి మెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలన్నారు.

Similar News

News September 16, 2025

కాకినాడ ఎస్పీ పీజీఆర్ఎస్‌కు 52 దరఖాస్తులు

image

కాకినాడలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్ఎస్‌కు 52 అర్జీలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు లిఖిత పూర్వకంగా ఎస్పీకి తమ సమస్యలను విన్నవించారు. వాటిపై స్పందించిన ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

News September 16, 2025

సిరిసిల్లల: ఈ నెల16 నుంచి 18 వరకు క్రీడల పోటీలు

image

అండర్ 14, 17 బాల బాలికల క్రీడల పోటీలను సిరిసిల్ల రాజీవ్ నగర్‌లోని మినీ స్టేడియంలో నిర్వహిస్తామని SGF సెక్రటరీ నర్రా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 16 నుంచి 18 వరకు క్రీడల పోటీలు నిర్వహిస్తామని వివరించారు. 16న అథ్లెటిక్స్ లో రన్నింగ్ ఈవెంట్స్, 17న అథ్లెటిక్స్ లో జంపింగ్, త్రోయింగ్ ఈవెంట్స్, ఈనెల 18న బాలికలకు కోకో పోటీలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

News September 16, 2025

కర్నూలు: సత్తా చాటిన కడప జట్లు

image

కర్నూలులో రెండు రోజుల పాటు 17వ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. బాలురు, బాలికల విభాగంలో కడప జట్టు మొదటి స్థానంలో నిలిచి డబుల్ క్రౌన్ సాధించింది. కర్నూలు బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. విజేతలకు జిల్లా ఒలంపిక్ సంఘ అధ్యక్షుడు రామాంజనేయులు, ఏపీ హ్యాండ్ బాల్ సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు బహుమతులు అందజేశారు.