News December 18, 2025

ప్రశాంత ఎన్నికలకు సహకరించిన ప్రజలకు సీపీ కృతజ్ఞతలు

image

సిద్దిపేట జిల్లాలో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ముగిశాయని పోలీస్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచి, ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా సహకరించిన జిల్లా ప్రజలకు సోషల్ మీడియా వేదికగా సీపీ ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News December 20, 2025

‘జగిత్యాలలో వెల్‌నెస్ హెల్త్ సెంటర్ ఏర్పాటుచేయాలి’

image

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టు కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక వెల్‌నెస్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ PRTUTS జగిత్యాల జిల్లా శాఖ నాయకులు ఎమ్మెల్యే సంజయ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆనంద్ రావు, ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

News December 20, 2025

కడప జిల్లా యువతకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు

image

గుంటూరులోని KL యూనివర్సిటీలో ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో YSR కడప జిల్లా విద్యార్థిననులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో పొయెట్రీ విభాగంలో హీనఫిర్హత్ ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. స్టోరీ విభాగంలో వెంకట సాహిత్య ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీరిద్దరూ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా జ్ఞాపికలు అందుకున్నారు.

News December 20, 2025

జగిత్యాల: ‘ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయి’

image

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. జగిత్యాల కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.