News April 6, 2024
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పనిచేయండి: కలెక్టర్

త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా, హింసా రహితంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం ఎఫ్ఎస్టీ బృందాల పనితీరును పరిశీలించి అనంతరం సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు.
Similar News
News October 26, 2025
పాతపట్నం: కూతురిపై తండ్రి అఘాయిత్యం.. అబార్షన్ చేయడంతో మృతి

పాతపట్నం మండలం సరాళి గ్రామానికి చెందిన పోలాకి అప్పారావు హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడు. 11 ఏళ్ళ కూతురిపై అఘాయిత్యం చేయడంతో గర్భవతి అయింది. అక్కడ ఉన్నవారికి తెలియకుండా శ్రీకాకుళం తీసుకొచ్చి అబార్షన్ చేయించగా ఆరోగ్యం వికటించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ ఆమె మృతి చెందింది. అక్కడి వైద్యుల సమాచారం మేరకు పాతపట్నం ఎస్సై మధుసూదన రావు శనివారం కేసు నమోదు చేశారు.
News October 26, 2025
RAINS: శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక అధికారిగా చక్రదర్ బాబు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను తీవ్ర వాయుగుండం రూపంలో దూసుకొస్తుంది. ఈ తుఫాను నుంచి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అధికారిగా IAS చక్రదర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జిల్లా JC గా పనిచేసిన అనుభవం ఇతనికుంది.
News October 26, 2025
SKLM: పొట్ట దశలో పైర్లు.. వర్షం పొట్టన పెట్టుకోవద్దని వేడుకోలు!

జిల్లా వ్యాప్తంగా అన్నదాతల్లో మొంథా తుఫాన్ రాక గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నాలుగైదు రోజులు తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో పంటలపై ఎంతమేర ప్రభావం చూపుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పంట వేసిన నుంచి అనేక ఆటుపోట్లు, యూరియా పాట్లు ఎదుర్కొన్న అనంతరం వరి పైరు ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. ఇలాంటి సమయంలో ఏ నష్టం జరగొద్దని రైతన్నలు దేవుడికి మొక్కుకుంటున్నారు.


