News August 26, 2025

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలి: SP

image

శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం సూచించారు. ఉత్సవాలలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు, అపసృతులకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ వేడుకల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవలసిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు.

Similar News

News August 26, 2025

టెక్కలిలో లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయనశాస్త్రం, కంప్యూటర్ అప్లికేషన్స్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ టి. గోవిందమ్మ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీజీలో కనీసం 55 శాతం మార్కులు, ఏపీ సెట్, యూజీసీ నెట్ అర్హత, పీహెచ్‌డీ అర్హత కలిగిన వారు ఆగష్టు 30న కళాశాలలో జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావలన్నారు.

News August 26, 2025

జి.సిగడాం: కత్తిపోట్ల దాడిలో యువకుడు మృతి

image

కత్తిపోట్లకు గురైన ఓ యవకుడు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఎస్సై మధుసూదనరావు తెలిపిన వివరాల మేరకు జీసిగాడం(M) గెడ్డకంచారానికి చెందిన రాజశేఖర్‌, గొబ్బూరు గ్రామస్థుడు శంకర్‌ల మధ్య ఆదివారం ఓ విషయంపై వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శంకర్ క్షణికావేశంలో కత్తితో రాజశేఖర్‌పై దాడి చేశారు. క్షతగాత్రుడుని స్థానికులు రిమ్స్‌లో చేర్చగా అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదైంది.

News August 26, 2025

శ్రీకాకుళం: 28న DSC అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

image

డీఎస్సీ ఫలితాల్లో పలు విభాగాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 28న జరగనుంది. ఈ మేరకు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీతో మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్‌లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సంబంధిత ధ్రువ పత్రాలను గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణతో 3 సెట్ల జిరాక్స్‌, 5 ఫొటోలతో కేటాయించిన తేదీ, వేదికకు సమయానికి హాజరవ్వాలన్నారు.