News March 23, 2024
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: డీఐజీ

రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు అధికారులను ఆదేశించారు. 4 జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. క్రికెట్ బెట్టింగ్, క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Similar News
News April 25, 2025
కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య!

కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. లేబర్ కాలనీకి చెందిన రవి, లక్ష్మీజ్యోతి (39) దంపతుల కుమారుడు భరత్ పదో తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. మనస్తాపం చెందిన తల్లి క్షణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుంది. ఆమె భర్త గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 25, 2025
పంచాయతీరాజ్ పాత్ర కీలకమైంది: కర్నూలు కలెక్టర్

గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు.
News April 24, 2025
కర్నూలు జిల్లా టాపర్లు వీరే!

కర్నూలు జిల్లా విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అదరగొట్టారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ఏడుగురు 597 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. కర్నూలుకు చెందిన టి.గాయత్రి, గీతిక, కీర్తన, ఎమ్మిగనూరుకు చెందిన మహ్మద్, ఆదోనికి చెందిన సలీమా, జి.నందు, హరిణి టాపర్ల జాబితాలో ఉన్నారు. ఇక జిల్లాలో మొత్తం 31,185 మంది పరీక్ష రాయగా 20,584 మంది పాసయ్యారు.