News September 7, 2024
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోండి: SP

వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి మీడియా మిత్రులకు ఎస్పీ ఏఆర్ దామోదర్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో వినాయక చవితి పందిళ్లు/ మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ వారు, పోలీసువారి సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. సంఘటనలు తలెత్తితే వెంటనే స్థానిక పోలీసు లేదా డయల్ 112/100 ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News November 11, 2025
ప్రకాశం: పెద్ద చెర్లోపల్లికి చేరుకున్న సీఎం

ఇవాళ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పెద్ద చెర్లోపల్లి మండలం ఇర్లపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ ఇన్‌ఛార్జులు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభాస్థలికి చేరకున్నారు.
News November 11, 2025
ప్రకాశం జిల్లాకు సీఎం.. షెడ్యూల్ ఇదే.!

ఇవాళ CM చంద్రబాబు జిల్లాలోని పెద్ద చెర్లో పల్లి (M) పెద ఇర్లపాడులోని MSME పార్కుల ప్రారంభోత్సవానికి రానున్నారు. ఇవాళ ఉదయం 9:30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి 10:15 కు ఇర్లపాడులోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 10:35 గంటలకి సభా ప్రాంగణానికి వచ్చి MSME పార్కులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:15 గం.కు ఉండవల్లికి బయలుదేరుతారు.
News November 10, 2025
ఢిల్లీలో పేలుళ్లు.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు!

ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోమవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఒంగోలులోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్ బృందంతోపాటు పోలీసులు తనిఖీలు నిర్వహించి, అనుమానిత వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.


