News October 14, 2025
ప్రశాంత వాతావరణంలో దీపావళి జరుపుకోండి: కలెక్టర్

దీపావళి పండుగ శాంతియుతంగా జరగాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా IAS సూచించారు. పండుగ సందర్భంగా పోలీసు, అగ్నిమాపక, విద్యుత్, ఆరోగ్య, మున్సిపల్ శాఖలతో పాటు టపాకాయల విక్రయదారులతో సమన్వయ మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రజలు భద్రతా నియమాలను పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 14, 2025
ADB: అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి

అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు అండగా నిలవాలని, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న
దౌర్జన్యాల పట్ల తక్షణమే స్పందించి వారికి న్యాయం చేకూర్చాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి సభ్యుల అభిప్రాయాలు స్వీకరించారు.
News October 14, 2025
సిద్దిపేట: భూభారతి ధరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష

సిద్దిపేట కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో భూ భారతి పెండింగ్ అప్లికేషన్ డిస్పోజల్ ప్రక్రియ గూర్చి జిల్లా కలెక్టర్ K.హైమావతి జూమ్ సమీక్ష నిర్వహించారు. RDO, తహశీల్దార్ ఇతర రెవెన్యూ అధికారులతో జరిగిన సమావేశంలో మిస్సింగ్ సర్వ్ నంబర్, పెండింగ్ మ్యుటేషన్, సక్సేషన్, DS, ఫీల్డ్ ఎంక్వైరీ, POB, సాదా బైనామా వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు.
News October 14, 2025
‘ఇది ఆల్‌టైమ్ చెత్త ఫొటో’.. ట్రంప్ సెల్ఫ్ ట్రోలింగ్

టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించిన తన ఫొటో చెత్తగా ఉందంటూ US ప్రెసిడెంట్ ట్రంప్ సెల్ఫ్ ట్రోల్ చేసుకున్నారు. ‘నా గురించి మంచి కథనం రాశారు. కానీ ఫొటో మాత్రం వరస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్. నా జుట్టు కనిపించకుండా చేశారు. తలపై ఏదో చిన్న కిరీటం ఎగురుతున్నట్టు పెట్టారు. భయంకరంగా ఉంది. కింది నుంచి తీసే ఫొటోలు నాకిష్టం ఉండవు. ఇది సూపర్ బ్యాడ్ పిక్చర్. ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అని అసహనం వ్యక్తం చేశారు.