News October 23, 2025

ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయు సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు అందించాలన్నారు.

Similar News

News October 23, 2025

₹6500 కోట్లతో పల్లె పండుగ 2.0

image

AP: గ్రామాల రూపురేఖలు మార్చేలా పల్లె పండుగ-2.0కు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికోసం ₹6500 కోట్లతో 52వేల పనులు చేపట్టి సంక్రాంతికి పూర్తి చేసేలా ప్లాన్ రూపొందిస్తోంది. ఈనెలాఖరు లేదా నవంబర్ తొలివారంలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. గతేడాది ఇదే ప్రోగ్రాం కింద ₹4500 కోట్లు ఖర్చు చేశారు. ఈసారి కూడా గతంలో మాదిరి రోడ్లు, కాలువలు, గోకులాలతో పాటు 1107 పంచాయతీల్లో మ్యాజిక్ డ్రెయిన్ ఇతర పనులు చేపట్టనున్నారు.

News October 23, 2025

సిరిసిల్ల: చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

image

సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ చెరువులో ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారంయ.. దేశాయిపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల నరసవ్వ(65) అనారోగ్య సమస్యలతో ఇంటి నుంచి బుధవారం వెళ్లిపోయింది. మృతురాలి కుమారుడు పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News October 23, 2025

వేధింపులను ధైర్యంగా ఎదుర్కోండి

image

చాలామంది మహిళలు భర్త, అత్తవారింటి నుంచి వేధింపులు ఎదురైనపుడు కుటుంబ పరువు గురించి ఆలోచించి వాటిని భరిస్తూ కుంగిపోతున్నారు. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మహిళలను వెంబడించినా, దూషించినా, అడ్డుకున్నా, వేధింపులకు గురి చేసినా.. ఐపీసీ పలు సెక్షన్ల కింద శిక్షార్హులని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వాటిపై మహిళలు అవగాహన పెంచుకోవాలని, అందుబాటులో ఉన్న సౌకర్యాలు వాడుకోవాలని సూచిస్తున్నారు.