News December 31, 2025

ప్రసాదంలో నత్తపై ప్రశ్నిస్తే కేసులా?: కేకే రాజు

image

సింహాచలం ప్రసాదంలో నత్త రావడంపై ప్రశ్నించిన భక్తులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి బదులుగా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలవుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఆలయాలను రాజకీయ వేదికలుగా మార్చడం వల్లే నిర్వహణ అస్తవ్యస్తమైందని, భక్తులను కేసులతో భయపెట్టడం దారుణమన్నారు.

Similar News

News January 6, 2026

విశాఖ జూలో జనవరి 8 నుంచి ‘వింటర్ క్యాంప్’

image

విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో జనవరి 8 నుంచి 11 వరకు చిన్నారుల కోసం ‘జూ వింటర్ క్యాంప్’ నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించే ఈ క్యాంప్‌లో వెటరినరీ హాస్పిటల్ సందర్శన, జంతు సంరక్షకులతో ముఖాముఖి వంటివి ఉంటాయి. పాల్గొనే వారికి టీ-షర్ట్, సర్టిఫికెట్, 10 సార్లు ఉచిత ప్రవేశం కల్పించే ‘జూ పాస్‌పోర్ట్’ అందజేస్తారు.

News January 5, 2026

మహిళల భద్రతకు సఖి వాహనం: కలెక్టర్

image

మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ స్టాప్ సెంటర్ సఖి వాహనాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఎలాంటి భయాందోళన లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు ఈ వాహనం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలో మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

News January 5, 2026

కౌన్సిల్ ఆమోదం లేకుండా టెండర్లు: పీతల మూర్తి ఫిర్యాదు

image

జీవీఎంసీలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ముడసర్లోవ భూములపై రక్షణ ఏర్పాటు చేసి కబ్జాలు తొలగించాలని కమిషనర్ కేతన్ గార్గ్‌కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. గుర్రాల పార్కు టెండర్ రద్దు చేయాలన్నారు. గత ప్రభుత్వం కౌన్సిల్ ఆమోదం లేకుండా ఆరు కోట్ల రూపాయలు టెండర్లు ఖరారు చేశారని ఆరోపించారు. ఇటీవల అధికారులు కూడా కౌన్సిల్‌కు తెలియకుండా చెల్లింపులు చేశారన్నారు.