News October 22, 2025
ప్రసూతి మరణంపై నివేదిక ఇవ్వండి: పవన్ కళ్యాణ్

చేబ్రోలుకు చెందిన దుర్గా ప్రసూతి మరణంపై తక్షణ నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం అధికారులను ఆదేశించారు. ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్, పాడా పీడీలతో ఫోన్‌లో మాట్లాడారు. మెటర్నల్ డెత్‌లపై ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ నిర్వహించాలని, ప్రసూతి సమయంలో వైద్య సేవలకు సంబంధించి వైద్యులను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
Similar News
News October 24, 2025
SEX WARFARE: అందమే ఆయుధం

జనరేషన్లు మారేకొద్ది యుద్ధాల్లోనూ కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. శత్రువులను దెబ్బతీసే సరికొత్త మార్గాలపై దేశాలు దృష్టిపెడుతున్నాయి. అందమైన అమ్మాయిలను వలగా వేసి శత్రు రహస్యాలు రాబట్టే SEX WARFARE, HONEYTRAPS ఇందులో భాగమే. రష్యన్, చైనీస్ యువతులు తమ టెక్ కంపెనీల్లో స్పైలుగా పనిచేస్తున్నారని US మీడియా పేర్కొంది. సీక్రెట్ ఫైల్స్, ఇన్ఫర్మేషన్ కోసం ఉద్యోగులను పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కంటున్నారంది.
News October 24, 2025
SKLM: డైట్‌లో పోస్టులకు ఈ నెల 29 లాస్ట్ డేట్

వమరవెల్లిలోని ప్రభుత్వ జిల్లా శిక్షణ సంస్థ (డైట్‌లో) డిప్యూటేషన్‌పై లెక్చరర్లు పోస్టులు భర్తీ చేసేందుకు అక్టోబర్ 29న ఆఖరి తేదీని జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు పేర్కొన్నారు. డిప్యూటేషన్‌పై ముగ్గురు సీనియర్ లెక్చరర్లు, 8 మంది సాధారణ లెక్చరర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన తెలియజేశారు. ZP మున్సిపల్ యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే అర్హులన్నారు.
News October 24, 2025
రోడ్డు భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో రోడ్డు భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని ఎస్పీ జగదీశ్‌తో కలిసి నిర్వహించారు. రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. గుత్తి -గుంతకల్లు రోడ్లోని రోడ్ & ఆర్ఓబీని, రాప్తాడు వద్ద రైల్వేలైన్ ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలన్నారు.


