News January 7, 2026
ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: కొప్పుల ఈశ్వర్

జగిత్యాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాల క్రితం తమ చేతుల మీదగా ప్రారంభించిన ఎస్సీ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని బుధవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కేసీఆర్ పాలనలో స్టడీ సర్కిల్ కేంద్రాలు విజయవంతంగా నడిచాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడంలేదని విమర్శించారు. గతంలో స్టడీ సర్కిల్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో కృషి చేశాయని అన్నారు.
Similar News
News February 19, 2026
MDK: గుండెపోటుతో కుప్పకూలాడు!

వెల్దుర్తి మండల పరిధిలోని ఆరెగూడెంలో బుధవారం రాత్రి గుండెపోటుతో తిరుపతి (23) అనే యువకుడు మృతి చెందాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే తిరుపతి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు రావడం గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
News February 19, 2026
అమరావతిలో దసపల్లా హోటల్ పనులు షురూ

అమరావతిలో దసపల్లా 4-స్టార్ హోటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో లగ్జరీ గదులు, సూట్స్, ప్రీమియం సర్వీస్ అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉంటాయి. రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, వెల్‌నెస్ సెంటర్, హెల్త్ క్లబ్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో ఈ హోటల్ రూపుదిద్దుకుంటోంది. రాజధానిలో ఆతిథ్య రంగానికి ఇది మరింత ఊతమివ్వనుంది.
News February 19, 2026
మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని <


