News February 15, 2025

ప్రాక్టికల్ పరీక్షలలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఆర్ఐఓ

image

జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రధాన భాగస్వాములైన ఎగ్జామినర్లు, చీఫ్, అడిషనల్ సూపరింటెండెంట్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆర్ఐఓ డాక్టర్ ఏ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం తుది విడత పరీక్ష కేంద్రాల చీఫ్ అడిషనల్, చీఫ్ సూపరింటెండెంట్‌‌లకు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆర్ఐఓ సూచించారు. పరీక్ష పై ఆపోహలు, ఆరోపణలు రాకుండా చూడాలని కోరారు.

Similar News

News January 29, 2026

NLR: అంతంతగానే సోలార్స్ సిస్టం ఏర్పాటు

image

నెల్లూరు జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకానికి స్పందన అంతంతగానే ఉంది. ఆన్‌లైన్ ద్వారా 65,916 అప్లికేషన్స్ వచ్చాయి. సోలార్ ప్యానల్స్ ఇచ్చేందుకు 5,744 మంది వెండర్స్ ముందుకొచ్చారు. 3,086 పరికరాలను మాత్రమే అమర్చారు. 2,767 సర్వీస్లకు రూ.2158 లక్షల సబ్సిడీని విడుదల చేశారు. 1kv కి ₹30వేలు, 2kv ₹60వేలు, 3kv-10kv వరకు ₹78 వేలు సబ్సీడీ ఇస్తున్నారు. వెండర్స్ ఎక్కువ మంది లేకపోవడంతో పథకం లక్ష్యం చేరడం లేదు.

News January 29, 2026

నెల్లూరు: ఫ్రీ ల్యాప్‌టాప్.. వైరల్

image

ఫ్రీ ల్యాప్‌టాప్ పథకం అంటూ నెల్లూరు జిల్లాలోని వాట్సాప్‌ గ్రూపుల్లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇండియా ఫ్రీ ల్యాప్‌టాప్-2026 పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని.. వివరాలు నమోదు చేసుకుంటే ఫ్రీగా ఇస్తారని ఓ లింకును షేర్ చేస్తున్నారు. ఇలాంటి పథకంపై అధికారులు ఎక్కడా ప్రకటన చేయలేదు. ఇలాంటి మెసేజ్‌లపై జాగ్రత్తగా ఉండండి.

News January 29, 2026

నెల్లూరు: అమ్మను నడిరోడ్డుపై వదిలేశాడు..!

image

కనిపెంచిన తల్లి భారమనకున్నాడు. నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో వెలుగు చూసింది. ఈదలవారిపాలేనికి చెందిన వృద్ధురాలు మేకల లింగమ్మను అతని కుమారుడు ఆటోలో తీసుకు వచ్చి పంటపాళెం రోడ్డుపై వదిలేశాడు. ముత్తుకూరు పోలీసులు ఆమెను ఇంటికి చేర్చారు. కుమారుడికి తమదైన శైలిలో స్ట్రాంగ్ కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.