News September 22, 2025

ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రతిపాదనలు సమర్పించండి: కలెక్టర్

image

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాలు, రోడ్లు–భవనాల నిర్మాణం వంటి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి ప్రాజెక్టుకు ఎంత భూమి అవసరమవుతుందో స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

Similar News

News September 22, 2025

సంగారెడ్డిలో ప్రజావాణికి 33 ఫిర్యాదులు

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాధురి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మొత్తం 33 మంది తమ సమస్యలను విన్నవించారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ప్రజలకు కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News September 22, 2025

ANU: దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలను వర్సిటీ VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ లు సోమవారం విడుదల చేశారు. ఎంబీఏ 600 మందికి 435మంది, ఎంసీఏ 128 మందికి 80మంది అర్హత సాధించారన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ www.anucde.info. నుండి ఫలితాలు పొందవచ్చు అన్నారు.

News September 22, 2025

ఎన్టీఆర్: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో UG 3వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు అక్టోబర్ 30, నవంబర్ 7 నుంచి నిర్వహిస్తామని..పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 25లోపు, రూ.100 ఫైన్‌తో అక్టోబర్ 4లోపు ఫీజు చెల్లించాలని ANU పరీక్షల విభాగం సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని సూచించింది.