News April 8, 2024
ప్రాణం ఉన్నంతవరకు జగన్‌తోనే ఉంటా: VSR

ప్రాణం ఉన్నంతవరకు తాను CM జగన్‌తోనే ఉంటానని వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి(VSR) అన్నారు. 35 ఏళ్లుగా జగన్ కుటుంబంతో ఉన్నానని.. ఇకపై కూడా ఉంటానని చెప్పారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఆ కుటుంబంతో తన బంధం శాశ్వతమని పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతుల్లా తనకు వెన్నుపోటు పొడవడం, పార్టీలు మారడం తెలియదన్నారు. విడవలూరు రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News October 4, 2025
నెల్లూరు జిల్లాలో 17,406 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి

‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకానికి జిల్లాలో 17,406 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు. నేడు సీఎం చంద్రబాబు అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.15 వేలు నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాలో నెల్లూరు రూరల్ -3441, నెల్లూరు అర్బన్ -1821, సర్వేపల్లి -2651, కోవూరు -2585, కావలి -1888, ఆత్మకూరు -1636, ఉదయగిరి -1406, కందుకూరు -1004, వెంకటగిరి -974 మందిని లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు.
News October 4, 2025
నెల్లూరు: 85 మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి

జిల్లాలో 85 మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో లాంగ్వేజ్ పండిట్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించామన్నారు.
News October 4, 2025
నెల్లూరు: అంగన్వాడీల్లో ఆటపాటల్లేవ్..!

చిన్నారులకు ఆట, పాటలతో సాగాల్సిన విద్యాబోధన నీరుగారుతుందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2934 అంగన్వాడీ కేంద్రాల్లో 45,999 మంది పిల్లలు ఉన్నారు. చాలా కేంద్రాల్లో ఆట వస్తువులు ఉండకపోగా, ఉన్నవి కాస్త విరిగిపోయి ఉన్నాయి. దీంతో ఆట వస్తువులు లేక నోటి మాటలతోనే బోధన సాగిస్తున్నారు. గతంలో ఇచ్చినవే అరకొరగా ఉన్నాయి తప్పితే.. కొత్తగా మంజూరు చేయలేదు. ఇకనైనా అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.