News July 16, 2024
ప్రాణాలు కాపాడిన గుత్తి ప్రభుత్వ వైద్యులు

గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మంగళవారం గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చిన రోగికి క్షణం ఆలస్యం చేయకుండా ఇంజక్షన్ ఇచ్చి బతికించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజుల గ్రామానికి చెందిన చిన్న ఓబులేసు అనంతపురం వెళ్తుండగా గుత్తి సమీపంలో ఛాతీ నొప్పికి గురయ్యారు. వెంటనే గుత్తి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప గుండెపోటును నివారించే ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించారు.
Similar News
News February 15, 2026
అనంత: PGRS రద్దు.. కారణం ఇదే.!

ఈనెల 16న జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. CM ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలతో కలిసి బిల్గేట్స్ బృందంతో విజయవాడలో జరిగే సమావేశం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కూడా కార్యక్రమాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు.
News February 15, 2026
కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

జిల్లా ప్రజలు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఈనెల 16న అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించబడుతుందన్నారు. అర్జీదారులు అవసరమైన పత్రాలతో హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
News February 14, 2026
ముచ్చటగా మూడోసారి..

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముచ్చటగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఒటాన్ అకౌంట్, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన 2026-27 ఆర్థిక సంవత్సరానికి శనివారం ఉదయం 11:15 గంటలకు అసెంబ్లీలో సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి-సంక్షేమానికి సమతూకం కల్పించేలా రూపకల్పన చేసినట్లు సమాచారం. సీఎం మార్గనిర్దేశంతో, పది రోజుల ప్రీ-బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ బడ్జెట్ సిద్ధమైంది.


