News December 10, 2025
ప్రాణాలు తీసిన గ్యాస్ గీజర్లు

గ్యాస్ గీజర్లు కారణంగా 2 వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. బెంగళూరులో 26 ఏళ్ల చాందినీతో పాటు నాలుగేళ్ల కుమార్తె గీజర్ గ్యాస్ లీక్ అయి ప్రాణాలు కోల్పోయారు. UPలోని బఘ్‌పట్‌లో అభిషేక్ అనే యువకుడు బాత్‌రూమ్‌లో గీజర్ నుంచి వెలువడిన గ్యాస్ వల్ల మృతిచెందాడు. తలుపును పగులగొట్టి బయటకు తీసేలోపే చనిపోయాడు. క్లోజ్డ్ బాత్‌రూమ్‌లో గ్యాస్ <<18108885>>గీజర్<<>> వినియోగం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News December 12, 2025
NHIDCL 64 పోస్టులకు నోటిఫికేషన్

<
News December 12, 2025
సుదీర్ఘ నిరీక్షణకు తెర.. రేపటి నుంచి ‘డ్రాగన్’ షూటింగ్!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు తిరిగి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌లో 2 వారాల షూటింగ్ తర్వాత 6నెలలు గ్యాప్ ఇచ్చిన మేకర్స్ రేపటి నుంచి చిత్రీకరణలో బిజీ కానున్నారు. మూడు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కీలక సీన్లు, సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. రెండు పార్టుల షూటింగ్‌ను ఒకేసారి పూర్తిచేసి తొలి భాగాన్ని 2026 DECలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
News December 12, 2025
ప్రియాంకకు పార్టీ పగ్గాలివ్వాలి.. సోనియాకు సీనియర్ నేత లెటర్

దేశ, పార్టీ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, పార్టీ లీడర్‌షిప్‌ను ప్రియాంకా గాంధీకి అప్పగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఒడిశా మాజీ MLA మహమ్మద్ మొకియమ్ కోరారు. 83 ఏళ్ల ఖర్గేను AICC ప్రెసిడెంట్‌గా తప్పించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ చీఫ్ సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సచిన్ పైలట్, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, శశి థరూర్ వంటి నేతలతో కోర్ లీడర్‌షిప్ ఏర్పాటు చేయాలని కోరారు.


