News November 17, 2025
ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. ధరలు ఇలా..!

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.19,000 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.18 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.15,700 కి చేరింది. కాగా, నేడు పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు వ్యాపారులు తెలుపడంతో మార్కెట్‌కు పత్తి రాలేదు.
Similar News
News November 17, 2025
యాదాద్రి: గ్రామ గ్రామాల్లో లక్ష్మీ నరసింహ కళ్యాణం: ఈవో

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుల కల్యాణం విదేశాల్లో తగ్గించి మారుమూల గ్రామాల్లోనూ నిర్వహిస్తామని దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు చెప్పారు. కొండపైన అధికారులు, అర్చక బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామీణుల అభ్యర్థన మేరకు స్వామి కల్యాణాలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ప్రచార రథాలను తక్షణమే అందుబాటులో తెస్తామన్నారు. గోశాలలో దామోదర కళ్యాణం సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News November 17, 2025
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.
News November 17, 2025
ఉమ్మడి జిల్లా ఖోఖో టోర్నమెంట్లో విజేతలుగా జగిత్యాల

కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 18 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖోఖో జూనియర్స్ బాలబాలికల పోటీలలో జగిత్యాల జిల్లా జట్లు విజయకేతనం ఎగురవేశాయి. అలాగే బాలికలలో ద్వితీయ స్థానం కరీంనగర్ జిల్లా జట్టు సాధించింది. వీరికి కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ వి.నవీన్ కుమార్ పాల్గొన్నారు.


