News January 24, 2025
ప్రారంభమైన చిత్తారమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు

రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు గణపతి పూజ, అమ్మవారికి ఘటాభిషేకం, కంకణ ధారణ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ, నిత్యబలిహారం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Similar News
News December 24, 2025
అధికారులను జైలుకు పంపిస్తాం: హరీశ్ రావు

పోస్టింగులు, ప్రమోషన్ల కోసం సీఎం రేవంత్‌కు సహకరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వదిలిపెట్టబోమని హరీశ్ రావు హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. రిటైర్ అయినా, డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లినా తప్పించుకోలేరన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆధారాలు లేకున్నా రేవంత్‌కు సహకరిస్తున్న వారిని వదలమని పేర్కొన్నారు.
News December 24, 2025
మెదక్ ఎస్పీకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ శ్రీఎస్.మహేందర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీలు నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
News December 24, 2025
మెదక్: చర్చి వద్ద 496 మందితో భారీ బందోబస్త్: ఎస్పీ

క్రిస్మస్ సందర్బంగా ప్రఖ్యాత మెదక్ చర్చ్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో 496 మందితో బందోబస్త్ కల్పించనున్నారు. డీఎస్పీలు-4, సీఐలు-12, ఎస్ఐలు-47, ఏఎస్ఐలు-31, HC/WHC-46, PC/WPC-185, HG/WHG-87, 3QRT-51, 3 రూప్ పార్టీస్ 33 మంది సిబ్బందితో చర్చి వద్ద బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. చర్చి ముందు కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు.


