News October 13, 2025

ప్రారంభాలు తప్ప విక్రయాలు లేవా..?

image

తిరుచానూరు మామిడి కాయలు మండి వద్ద మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మూడోసారి ప్రారంభమైన రైతుబజారు సైతం మూతపడింది. గత ప్రభుత్వం హయాంలో రెండు సార్లు, గత బుధవారం మూడోసారి ఈ మార్కెట్‌ను అధికారులు ప్రారంభించారు. అయితే రైతులు ఎవరూ రాకపోవడంతో మూతవేసి ఉంది. మార్కెట్‌లో సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News October 13, 2025

ఆదిలాబాద్: గుస్సాడీ టోపీలకు ఆదివాసీ ఆడపడుచుల పూజలు

image

ఆదివాసీలు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే గుస్సాడీ పండుగ సందడి ఆదివాసీ గ్రామాల్లో ప్రారంభమైంది. సొనాల మండలంలోని పార్డి(K) గ్రామంలో దీపావళి ముందు వచ్చే భోగి పండుగను జరుపుకున్నారు. ఈ రోజున ఆదివాసీ ఆడపడుచులు గుస్సాడీ టోపీలకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

News October 13, 2025

నల్గొండ: ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి

image

చిట్యాలకు చెందిన బోరు బండి యజమాని ఒడిశాలో ఏనుగుల దాడిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రారపు సైదులు దసరాకు ఇంటికి వచ్చాడు. బోరు పనుల కోసం శనివారం ఒడిశాలోని దేన్ కనాల్ జిల్లాలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడికి ఒక్కసారిగా వచ్చిన ఏనుగుల గుంపు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం మృతదేహన్ని చిట్యాలకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

News October 13, 2025

CRDA భవనాన్ని ప్రారంభించిన CM CBN

image

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన సీఆర్డీఏ భవనం అందుబాటులోకి వచ్చింది. దీన్ని సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించారు. భవనం లోపల క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బిల్డింగ్ బయట ఫొటోలు దిగారు. హైదరాబాద్‌కు దీటుగా అమరావతిని అభివృద్ధి చేస్తానని సీఎం స్పష్టం చేశారు.